హైదరాబాద్‌లోని మీర్ చౌక్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుల్జార్ హౌస్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 30 మంది భవనంలోని మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.