హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాతబస్తీ మీర్‌చౌక్‌లో శుక్రవారం ఉదయం ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్లాట్‌లో ఉన్న కుటుంబీకులు మంటల్లో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు.. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడి, మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.