హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి పెరిగాయి. కనీస ఛార్జి రూ. 10 నుంచి 12కు, గరిష్ఠ టికెట్ ధర రూ. 60 నుంచి 75కు పెంచారు. 2-4కి. మీ వరకు రూ. 18, 4-6కి. మీ వరకు రూ. 30, 6-9కి. మీ వరకు రూ. 40, 9-12కి. మీ వరకు రూ. 50, 12-15కి. మీ వరకు రూ. 55, 15-18కి. మీ వరకు రూ. 60, 18-21కి. మీ వరకు రూ. 66, 21-24కి. మీ వరకు రూ. 70, 24కి. మీ పైన అయితే రూ. 75 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు.