చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మాత్ బెగ్ శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. చార్మినార్ నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ అభివృద్ది పనులపై చర్చించారు. త్వరగా పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్సీ ఆదేశించారు. డివిజన్ పరిధిలో గల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్లతో సమన్వయం అవుతూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.