కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి గాగిల్లాపూర్ తాండలో వర్షం రావడంతో డ్రైనేజీ నీరు ఒక్కసారిగా ఇండ్లలోకి చేరింది. బుధవారం స్థానిక తండా వాసులు ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం నుంచి డ్రైనేజ్ విషయం గురించి స్థానిక శానిటేషన్ అధికారికి చెప్పిన పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు డ్రైనేజీ నీటిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.