సైబరాబాద్: అఘోరీపై కేసు నమోదు

63చూసినవారు
సైబరాబాద్: అఘోరీపై కేసు నమోదు
అఘోరీకి సంబంధించి కొత్త విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. సైబరాబాద్ పరిధి మోకిలా పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 25న అఘోరీపై కేసు నమోదైంది. పూజ చేస్తానని నమ్మించి తన వద్ద రూ.9.8 లక్షలు తీసుకున్నట్లు శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూర్‌కు చెందిన మహిళా ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేశారు. మరో రూ.5 లక్షలు ఇవ్వకుంటే తన కుటుంబం మొత్తాన్ని మంత్ర శక్తులతో అంతమొందిస్తానని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్