హైదరాబాద్‌లోని తన ఆఫీసులో కులగణన సర్వే పేపర్లను మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తగలబెట్టారు. కులగణన సర్వే ఓ దొంగ సర్వే అని ఆరోపించారు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. 'కులగణన సర్వేను జానారెడ్డి చేయించారు. ఈ సర్వేను మేం ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోం. ఈ విషయాన్ని బీసీలు సహించరు. సర్వేలో దాదాపు 40 లక్షల మంది బీసీలను తగ్గించటం అన్యాయం' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.