త్వరలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా, అత్యాధునిక హంగులతో ఆదర్శ ఇందిరమ్మ పాఠశాలలు నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి నూతన నియామకాలు చేపడుతామన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.