ఏఐ స్మార్ట్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన గంపా నాగేశ్వర్ రావు

53చూసినవారు
ఏఐ స్మార్ట్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన గంపా నాగేశ్వర్ రావు
ప్రముఖ ఏఐ నిపుణుడు నికీలు గుండా ఆధ్వర్యంలో డిజిప్రెన్యూర్.ఏఐ ద్వారా నిర్వహించబడుతున్న ఏఐ స్మార్ట్ క్యాంప్ పోస్టర్‌ను గంప నాగేశ్వర్‌రావు హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ పూర్తి ఆన్‌లైన్ కోర్సు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం రూపొందించబడింది. మే 19 నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంప్ మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు తెలుగులో 3:30 నుంచి 5:00 వరకు ఇంగ్లీష్‌లో జరగనుంది. "ఈ క్యాంప్ ద్వారా పిల్లలు, యువత ఏఐ నైపుణ్యాలతో తమ సాంకేతిక భవిష్యత్తును స్వయంగా నిర్మించుకునే అవకాశం పొందుతారు" అని నాగేశ్వర్‌రావు చెప్పారు. ఏఐ స్మార్ట్ క్యాంప్ అనేది 10 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం 11 రోజుల పాటు నిర్వహించబడే పూర్తి ఆన్‌లైన్ కోర్సు. ఈ క్యాంప్‌లో 30 కి పైగా టూల్స్ ను నేర్చుకుంటారు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఏఐ ఆధారిత నైపుణ్యాలను సరళమైన తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నేర్పిస్తారు, 25000 రూపాయల విలవైన బోనస్ లు కూడా అందించనున్నారు, అలాగే పాల్గొన్న వారికి సర్టిఫికేట్ కూడా అందిస్తారు. ఏఐ స్మార్ట్ క్యాంప్, డిజిప్రెన్యూర్.ఏఐ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఒక పూర్తి ఆన్‌లైన్ కోర్సు,6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత నైపుణ్యాలను నేర్పిస్తుంది. ఈ క్యాంప్‌లో విద్యార్థులు ప్రోగ్రామింగ్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలను సరళంగా నేర్చుకుంటారు. అలాగే, ఏఐ సాధనాలను ఉపయోగించి పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరచడం, పబ్లిక్ స్పీకింగ్‌లో నైపుణ్యం సాధించడం, ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. ఈ శిక్షణ విద్యార్థులను డిజిటల్ యుగంలో ఉద్యోగ అవకాశాలకు మరియు స్వయం ఉపాధికి సిద్ధం చేస్తుంది. మరిన్ని వివరాలకు www.aismartcamp.comను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్