ప్రజల సమస్యల పరిష్కారానికి టీపీసీసీ నేతృత్వంలో మంగళవారం గాంధీ భవన్‌లో “అందుబాటులో ప్రజా ప్రతినిధులు” కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి రోజు ఇద్దరు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారు.