బేగంబజార్ కు చెందిన యువకులు బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. బాసర ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్ నుంచి దాదాపు 18 మంది వచ్చారు. వారిలో ఐదుగురు రాకేష్, వినోద్, మదన్, కృతిక్ మరో యువకుడు గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగారు. ఒకరు అక్కడే మృతి చెందగా, మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.