దోమల నివారణపై కార్పొరేటర్ అవగాహన

69చూసినవారు
బేగంబజార్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది దోమల నివారణపై స్థానిక ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల వల్ల వచ్చే వ్యాదులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోని మందులు వాడాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్