బీఆర్ఎస్ నేత రాజీవ్ సాగర్ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందాలపై గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ సెల్ లో పిర్యాదు చేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలు పుట్టించి గాయని మంగ్లీ బర్త్ డే పార్టీకి హాజరయ్యానని, మాదకద్రవ్యాల కేసులో పట్టుబడినట్లు ప్రచారం చేశారని తెలిపారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తన ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్రపూరితంగా చేస్తున్నదిగా అభివర్ణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేశారు.