చార్మినార్ గుల్జర్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయాలపాలైన బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మధిర పర్యటనను రద్దు చేసి, వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు.