దేవుడి ఫోటోలు అడ్డుపెట్టి గంజాయి వ్యాపారం చేస్తున్నాడో ప్రబుద్ధుడు. దూల్ పేట్ లో టాస్క్ ఫోర్స్ STF టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి తన సిబ్బందితో కలిసి శనివారం రైడ్ చేశారు. ఓ ఇంట్లోని గదిలో తనిఖీ చేశారు. దేవుడి ఫోటోల వెనుక గంజాయి దాచినట్టు గుర్తించారు. ఏకంగా 20 కిలోల గంజాయి పట్టుబడటం గమనార్హం. ఎవరికి దొరకకుండా గంజాయి వ్యాపారులు ఇలా కొత్తదారులు ఎంచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.