రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్ మట్టి కొట్టింది అన్నారు. ప్రభుత్వాలు మారితే పథకాల పేర్లు మాత్రమే మారతాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో అసలు పథకాల నామరూపాలు లేకుండా పోయాయన్నారు. జలాశయాల్లో చేపలను వదలడం లేదని విమర్శించారు.