బీసీ సంఘాలు, మేధావులతో సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు ఎంపీ సురేష్ సెట్కర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ జ్ఞానేశ్వర్, ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు.