తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని మీడియా కమిటీ బుధవారం అఫ్జల్ గంజ్ లోని రాష్ట్ర కార్యాలయంలో హెచ్చరించింది. అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. ఎన్నికలు కమిషనర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై లీగల్ సెల్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.