బీజేపీ జాతీయ నాయకత్వం ఆశీస్సులు, రాష్ట్ర నాయకత్వం మద్దతుతో శనివారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్. రాంచందర్ రావు అధికారికంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని నేతలు ఆకాంక్షించారు.