హోలీ పండుగపై నగర పోలీసులు ఆంక్షలు విధించడంపై గురువారం హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. "మేము హోలీ ఎలా జరుపుకోవాలో ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్పాలా? " అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడవ నిజాం విధానంలో పాలన చేస్తున్నారని ఆరోపించారు. "హిందువులను అవమానిస్తే కేసీఆర్ పరిస్థితి ఏమైందో గుర్తుంచుకోండి, మీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది" అంటూ హెచ్చరించారు.