శారీరకంగా, మానసికంగా ప్రతిరోజు ఉల్లాసంగా ఉండాలంటే యోగ సాధన దైనందిన జీవితంలో భాగం కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కవాడిగూడ పి ఐ బి సెమినార్ హాల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, ట్రస్మా ప్రతినిధులు ఉన్నారు.