ముగ్గురు యువకులు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన హైదరాబాద్ ఎంజే మార్కెట్ కూడలి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎంజే మార్కెట్ వద్ద బస్సు, ద్విచక్రవాహనం పక్కనే వెళ్లడంతో, డ్రైవర్ లక్ష్మణ్ తో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు వాగ్వివాదానికి దిగి దాడి చేశారు. అడ్డువచ్చిన కండక్టర్ అంజమ్మను తోసివేశారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు మేరకు వారిపై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.