ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కొంగరకలాన్ కు రానున్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ ఫాక్స్కాన్ పనులను పరిశీలించనున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై కంపెనీ ప్రతినిధులతో చర్చించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 4గంటల వరకు కొంగరకలాన్ చేరుకుంటారని అధికార వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది.