హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పరీక్ష రాయడానికి వెళ్లిన యువతి అదృశ్యమైంది. సీఐ జగదీష్ వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన ఉగరాల మేఘన(23) ఏవిఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. కాగా శుక్రవారం ఉదయం 6 గంటలకు పరీక్షకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి కళాశాలకు వెళ్లింది. కాగా సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆమె సోదరుడు కాలేజ్ దగ్గర తనిఖీలు చేశారు. అనంతరం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.