యాచారం మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన గడేల రంగయ్య (95) సోమవారం వృద్ధాప్య పిన్షన్ తెచ్చుకుని, ఇంటి నుండి బయటికి వెళ్లి గ్రామ పంచాయతీ సమీపంలోని బొందల గడ్డ వద్ద ఉన్న బావిలో మృతి చెంది ఉన్నాడు. మంగళవారం బావి వద్ద చెప్పులు, చేతి కర్ర కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.