ఇబ్రహీంపట్నం: చికెన్ బిర్యానీలో బల్లి

85చూసినవారు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రం సాగర్ రోడ్డులో ఉన్న మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణరెడ్డి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా అయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోగా వచ్చిన తర్వాత బిర్యానీని తినడం మొదలుపెట్టారు. బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. తర్వాత తేరుకొని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నిలదీయగా ఆయన మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో కంగుతిన్న బాధితుడు పోలీసులకు 100 డయల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్