రంగారెడ్డి: రాబోయే మూడు గంటల్లో వర్షం

రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని పేర్కొంది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు తెలిపారు.