ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కొండగట్టు అంజన్నను దర్శించుకుని, మొక్కు తీర్చుకోనున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి మాదాపూర్‌లోని తన ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు. 11 గంటలకు అంజనేయస్వామి వారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటారు.