టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం మరోసారి నోటీసులు ఇచ్చారు. ట్రాపిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వ్యక్తిగతంగా తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ట్రాపిక్ కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడం, ట్రాపిక్ నిబంధనలు పాటించకపోవడంపై విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.