2025 ఆషాఢ బోనాలు ఉత్సవాల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్ MCHRDలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా, డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్, ఎండోమెంట్ డైరెక్టర్, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.