హైదరాబాద్ లో యువతి దీప్తి (29) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కానిస్టేబుల్ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది. తన చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణమని తెలిపింది. కానిస్టేబుల్ తన భార్యకు ఉద్యోగం కోసం దీప్తి తండ్రి సంగీత రావుకు రూ.15 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. జాబ్ ఇప్పించక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని అనిల్ తనను వేధించాడని తెలిపింది.