షేక్ పేటకు చెందిన 67 ఏళ్ళ వృద్దుడికి హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకు కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నామంటూ వీడియో కాల్ చేశారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని, స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలని, కాల్ లో ఉండగానే వివరాలు ఎంటర్ చేయాలని ఆ వృద్దుడికి సైబర్ నేరగాళ్ళు ఒక లింక్ పంపారు. వివరాలు ఎంటర్ చేయగానే లిమిట్ రూ 2.5 లక్షలకు పెరుగుతుందని, 24 గంటల్లో అప్డేట్ అవుతాడని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఫోన్ పెట్టగానే అతని ఖాతా నుండి రూ 2.03 డెబిట్ అవడంతో మోసపోయానని గ్రహించిన అతను వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.