మూసీ నది పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ శుక్రవారం కీలక సమీక్ష నిర్వహించారు. HYD-బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సంబంధిత అధికారులతో చర్చించారు. ఇప్పటివరకూ పనులు ఎంతవరకు వచ్చాయనే విషయం గురించి ఆరా తీశారు. అలాగే రాష్ట్రంలో జాతీయ రహదారులు, ట్రిపుల్‌పైనా అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్టులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యేలోపే మూసీ ప్రక్షాళన చేయాలని ఆదేశాలు జారీ చేశారు.