హైదరాబాద్‌లోని బోరబండలోని సాయిబాబా నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తన భార్యను వివస్త్రను చేసి, గుండు గీసి ఓ భర్త చంపేశాడు. నర్సింహులు, సోనికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల భార్య సోని భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి వచ్చింది. దీనిపై కోపం తెచ్చుకున్న నర్సింహులు ఆమెకు మద్యం తాగించి, వివస్త్రను చేసి, గుండు గీసి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితునిపై 16 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.