మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరీక్షల కోసం మరోసారి AIG ఆస్పత్రికి చేరుకున్నారు. నిన్న కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా, ఇవాళ మరికొన్ని పరీక్షల కోసం తిరిగి వచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు కేటీఆర్, హరీష్‌రావు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ఆరోగ్య పరీక్షలు కొనసాగుతున్నాయి.