హైదరాబాద్: డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

59చూసినవారు
హైదరాబాద్ లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై మంగళవారం నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోను రైడ్స్ కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్