గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కంపెనీలతో చర్చించి తగిన న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సీడ్ కంపెనీల ఆక్రమణలపై మోసపోయిన రైతులు మంగళవారం నందినగర్ లో కేటీఆర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. సీడ్ కంపెనీల మోసంతో కుటుంబాలతో సహా రోడ్ల మీదకు వచ్చామని వాపోయారు.