జీహెచ్ఎంసీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీధిలైట్ల సమస్య ఉంది. షేక్ పేట్ ప్లీ ఓవర్ పై గత కొన్ని రోజులుగా వీధిలైట్లు వెలగడం లేదు. దీంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఫ్లై ఓవర్ పై సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతోనే ఈ సమస్య ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు కోరుతున్నారు.