కాలు జారి గాయపడ్డ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నేతలతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.