కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
By కె. నాగేందర్ 52చూసినవారుహైదరాబాద్: లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు అంటూ బుధవారం కేటీఆర్‌కు కౌంటరిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు.. రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా? నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చా.. అయితే నీకూ నోటీసు పంపుతా.. కాచుకో అంటూ బండి సంజయ్ సవాల్ చేశారు. మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా అని బండి సంజయ్ అన్నారు.