జూబ్లీహిల్స్‌: మంత్రి కొండా సురేఖను కలిసిన కాపు, మున్నూరు కాపు సంఘాల నేతలు

77చూసినవారు
జూబ్లీహిల్స్‌: మంత్రి కొండా సురేఖను కలిసిన కాపు, మున్నూరు కాపు సంఘాల నేతలు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని 29 కాపు, మున్నూరు కాపు సంఘాల జేఏసీ ప్రతినిధులు శనివారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖను జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాపు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాపుల పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్