బంజారాహిల్స్ నందినగర్ లోని మాజీ మంత్రి కేటీఆర్ నివాసానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో అయన ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు జాగారం చేశారు. వికారాబాద్ అధికారులపై దాడి ఘటనలో కేటీఆర్ పాత్ర ఉందని రిమాండ్ రిపోర్టులో చేర్చడంతో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.