మా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకుని సాయం చేస్తా అన్నారు కానీ ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని నటుడు ఫిష్ వెంకట్ కుమార్తె చెప్పుకొచ్చారు. తమకు వచ్చిన నెంబర్ కు కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఫేక్ కాల్స్ తో కాలయాపన చేయకుండా నిజంగా సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సాయం చేయండి అంటూ వేడుకున్నారు. కాగా ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ సాయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.