న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడే వారికి అత్యధిక వైద్య చికిత్సలు అందించే నిమిత్తం రెనోవ ఆసుపత్రి నూతనంగా న్యూరో లాజికల్ సైన్స్ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని లెనోవా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సేవలను ప్రముఖ న్యూరో సర్జన్ మాజీ నిమ్స్ డైరెక్టర్ రాజారెడ్డి సంస్థ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో వస్తున్న నూతన విధానాలతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు చెప్పారు.