
సినీ పరిశ్రమ తీరుపై దిల్రాజు అసంతృప్తి
గద్దర్ అవార్డుల పంపిణీలో సినీ పరిశ్రమ తీరుపై ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. అవార్డులు వచ్చిన వారు కార్యక్రమానికి హాజరై అవార్డు తీసుకుంటే బాగుండేదన్నారు. అవార్డుల పంపిణీ కార్యక్రమానికి అందరూ సమయం కేటాయించాలని కోరారు. ఆరు నెలలు కష్టపడితే గద్దర్ అవార్డుల కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.