బసవతారకం ఆసుపత్రికి సోనో సైట్ ఆల్ట్రా సౌండ్ యంత్రం

61చూసినవారు
క్యాన్సర్ రోగులకు చికిత్సలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సోలో సైట్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని అందజేసింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని ఎల్ఐసీ అధికారులు పునీత్ కుమార్, శ్రీకృష్ణ ట్రస్ట్ బోర్డు మెంబర్ జేఎస్ఆర్ ప్రసాద్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్