యాదగిరి నగర్ కు చెందిన శ్రీనివాస్(27) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల భార్యతో గొడవ జరగడంతో పాపను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. శ్రీనివాస్ స్నేహితురాలు అతని కజిన్ సోదరుడికి ఫోన్ చేసి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలపగా, అతను వెళ్లి చూడగా శ్రీనివాస్ మృతి చెంది ఉన్నాడు. శ్రీనివాస్ సోదరుడు మధురానగర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.