పుష్ప-2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డును అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈ ప్రతిష్టాత్మక అవార్డులు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి థ్యాంక్యూ. మూవీ డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు, టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం అనుమతితో వేదికపై తగ్గేది లే డైలాగ్ చెప్పి అలరించారు.