తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న యువ కవుల సమ్మేళనాన్ని తెలంగాణ జాగృతి నిర్వహించనుంది. గురువారం హైదరాబాద్లో పోస్టర్‌ను జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ జీవన విశిష్టతను చాటడానికి, యువతలో సాహిత్య చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. 35 ఏళ్లలోపు కవులు తమ వివరాలు మే 26లోపు మెయిల్ చేయాలన్నారు.