T-Hubలో కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

67చూసినవారు
T-Hubలో కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
హైదరాబాద్‌కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ మరియు బీటెక్ విద్యార్థిని కల్వా హసిని, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, అభిషేక్ బొడ్డు, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు. కల్వా హసిని మాట్లాడుతూ,
"తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా నాకు అనేక కొత్త అనుభవాలు లభించాయన్నారు. AI టూల్స్, కమ్యూనిటీ బిల్డింగ్, నెట్‌వర్క్ డెవలప్‌మెంట్, వ్యాపార అవకాశాలు వంటి అంశాలను నేర్చుకున్నానన్నారు. గ్రాఫిక్ డిజైనింగ్‌లో తనకు ఆసక్తి ఉండేదని, కానీ ఈ బూట్ క్యాంప్ తన కెరీర్‌కు సరైన దారిని ఎంచుకోవడానికి స్పష్టతను ఇచ్చిందన్నారు. ఇప్పుడు తను AI టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించి, తన విద్యతో పాటు ఒక ఎంట్రప్రెన్యూర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించగలనని నమ్మకం కలిగిందన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని అందించిన గ్రోత్ క్లబ్ టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రాడ్యుయేషన్ వేడుకను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు!" అని అన్నారు.

సంబంధిత పోస్ట్